గుత్తి వంకాయ కర్రీ రెసిపి

 

 

 

కావలసిన పదార్థాలు:

లేతకాయలు - అర కేజీ

ఉల్లిపాయలు - అర కేజీ

టమోటాలు - అర కేజీ

ధనియాల పొడి - హఫ్ టీ స్పూన్

మిరప పొడి - 1 టీ స్పూన్

ఉప్పు - 2 టీ స్పూన్

పసుపు - తగినంత

ఆవాలు - హఫ్ టీ స్పూన్

కొబ్బరి: ఒకటి

అల్లం -  కొద్దిగా

నూనె - 2 టీ స్పూన్

పచ్చి మిర్చి - 9

కొత్తిమీర- తగినంత

నువ్వులు - 25 గ్రాములు

 

తయరుచేయు విధానం:

వంకాయలను శుభ్రంగా కడిగి పెట్టుకొవాలి.

టమోటాలు,ఉల్లిపాయలు,చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి .

వంకాయల్ని నిలువుగా గాట్లు పెట్టాలి. ఒక పాన్ లో నువ్వులు వేయించుకోవాలి.

దోరగా వేగాక వాటిని మిక్సీలొ వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.

మిరప పొడి,ధనియాలు పొడి, పసుపు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు అన్ని గ్రైడ్ చేసి వుంచుకోవాలి.

ఈ మసాలా ముద్దలో ఉప్పు వేసి కట్ చేసి వుంచిన వంకాయల్లో పెట్టాలి. తరువాత ఒక మందపాటి గిన్నే తీసుకుని స్టౌ మీద పెట్టి నూనె పొయ్యాలి.

నూనె కాగాక పోపు వేసి ఉల్లిపాయ, టమోటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి సన్నని మంట మీద ఉడకనివ్వాలి. ఆ ముక్కలు బాగా ఉడకాలి.

ఇప్పుడు ఆ గిన్నెలొ సరిపడా నీరు పోసి వంకాయలు బాగా మగ్గనివ్వాలి, చివరిలో పక్కన పెట్టిన నువ్వుల పొడిని గిన్నెలో వేసి అడుగు అంటకుండా నిముషం ఉంచాలి

కొత్తిమీర చల్లి అలంకరిస్తే ఊరించే గుత్తి వంకాయ కూర రెడీ......