గుమ్మడికాయ మసాలా!

  

కావలసిన పదార్థాలు: 

గుమ్మడికాయ ముక్కలు : ఒకటన్నర కప్పు

ఉల్లిపాయ ముక్కలు : అరకప్పు

పాలు  : అరకప్పు

పచ్చిమిర్చి : 2

అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1 చెంచా

గరం మసాలా : 1 చెంచా

జీలకర్ర   : అరచెంచా

ఆవాలు : అరచెంచా

కారం : అరచెంచా

పసుపు : చిటికెడు

ఉప్పు  : తగినంత

నూనె  : సరిపడా

కరివేపాకు  : 1 రెమ్మ

తయారీ విధానం: 

స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. వేడెక్కాక కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేయాలి. చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి, ఉప్పు చల్లాలి. వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకూ వేయించాలి. తరువాత గుమ్మడికాయ ముక్కలు వేసి, పసుపు చల్లి మూత పెట్టాలి. ఓ అయిదు నిమిషాల పాటు మగ్గిన తరువాత పాలు పోసి కలిపి మళ్లీ మూత పెట్టేయాలి. గుమ్మడికాయ ముక్క మెత్తబడిన తరువాత కారం, గరం మసాలా పొడి వేసి మళ్లీ మూత పెట్టేయాలి. పాలు ఇగిరిపోయేవరకూ ఉడికించి దించేసుకోవాలి. ఇది అన్నంలోకే కాకుండా చపాతీ, రోటీల్లోకి కూడా బాగుంటుంది. 

 

- Sameera