గోరుచిక్కుడు మసాలా ఫ్రై
కావలసిన పదార్థాలు :
గోరుచిక్కుడు... అర కేజీ
ధనియాలపొడి... ఒక స్పూన్.
మసాలాపొడి... టీస్పూన్.
ఉప్పు... తగినంత
అల్లంవెల్లుల్లి పేస్ట్ ... రెండు టీ స్పూన్స్ .
పసుపు... అర టీస్పూన్.
కారం... సరిపడా .
తయారీ విధానం :
గోరుచిక్కుళ్లను కావలసిన సైజు లో కట్ చేసి పెట్టుకోవాలి .
తర్వాత పాన్ లో పోసి ముక్కలు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు నీళ్ళు వడ కట్టుకోవాలి .
స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని నూనె కాగాక ఉడికించిన గోరుచిక్కుడు ముక్కలు,అల్లంవెల్లుల్లి పేస్ట్, ధనియాలపొడి,మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. కొంచంసేపు వేయించాలి .