Garelu (Vadalu)

 


కావలసినవి:-

మినప్పప్పు - 1 గ్లాసు 
ఉప్పు - 1 / 2 చెంచా 
నూనె - వేయించడానికి సరిపడినంత 


తయారీ విధానం :-

మినపగుళ్ళు 5 గం'' పాటు  కడిగి నీటిలో నానబెట్టాలి. దీనికి 2, 3 చెంచాలు పొట్టు మినప్పప్పు కలిపితే... ఆ రుచి ఇంకా బావుంటుంది.  పప్పు కడిగి వాడేసి... నీరు పూర్తిగా వాడినతరువాత... ఉప్పు ఇష్టమైతే జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం కలిపి రుబ్బుకోవాలి... మరీ పలుచగాకాకుండా కొద్ది కొద్దిగా  నీరు పోస్తూ మృదువుగా చేతికి ముద్దలా వచ్చేలా రుబ్బుకోవాలి. మిక్సీలో కన్నా గ్రైండర్ లో  అవకాశం ఉంటే రోట్లో రుబ్బుకుంటే గారెలు చాలా బాగా వస్తాయి. ఈ పిండిని గిన్నెలోకి తీసుకుని ఉల్లిముక్కలు కలుపుకుని అరచేతిలో లేక పాలధిన్ కవర్ పాలకవరుపై ఒత్తుకుని మధ్య చిన్న రంధ్రం చేసి నూనెలో జాగ్రత్తగా వదలాలి... నూనె కాగే వరకు వేడిగా ఉంచుకుని గారెలు మంట తగ్గించి వేసుకొని... బంగారు ఛాయ వచ్చేవరకు వేయించుకుని.. టిష్యు పేపరు మీదకు తీసుకోవాలి. పండుగలలో, నైవేద్యానికి అయితే ఉల్లిపాయలు లేకుండా గారెలు వేసుకోవాలి... ఇవి చాలా రుచిగా ఉంటాయి.  సాంబరుతో, చట్నీతో, పోపుపెరుగులో, పానకంలో  ఎలా తిన్నా చాలా చాలా బావుంటుంది.

https://www.youtube.com/watch?v=CZFwIIGROXU

- Bharathi