ఫ్రూట్ ఖీర్
కావలసినవి :
యాపిల్ : 1
అరటిపండు : 1
పాలు :1 లీటరు
కుంకుమ పువ్వు : అరస్పూన్
పంచదార : 2 కప్పులు
యాలకుల పొడి : 1 స్పూన్
కండెన్స్‌డ్ మిల్క్ : అరకప్పు
దానిమ్మ గింజలు : అరకప్పు
జీడిపప్పు: 20
బాదంపప్పు :20
తయారీ :
ముందుగా బాదం, జీడిపప్పులను గోరువెచ్చటి నీళ్లలో నానబెట్టాలి. వాటిలో సగం తీసుకుని కొద్దిగా పాలు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. మందపాటి గిన్నె తీసుకుని పాలు మరగబెట్టాలి. అందులోనే కండెన్స్‌డ్ మిల్క్, పంచదార వేసి సన్నమంట మీద ఉడికించాలి. ఐదు నిముషాల తర్వాత బాదం, జీడిపప్పు పేస్ట్ కలపాలి. అందులోనే యాపిల్, అరటి పండు ముక్కలు, దానిమ్మ గింజలు, యాలకుల పొడి, కుంకుమ పువ్వు రేకలు, మిగిలిన బాదం, జీడిపప్పు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్ లోకి తీసుకుని ఫ్రిజ్ లో పెట్టి గంట తరువాత సర్వ్ చేసుకోవాలి...