దూట పెరుగు పచ్చడి

 

 

కావలసిన పదార్ధాలు..

 

* దూటముక్కలు - 1 /2 కప్పు 

 

* పెరుగు - 1కప్పు

* ఉప్పు  - కొద్దిగా  

* పసుపు - చిటికెడు 

* అల్లం, పచ్చిమిర్చి ముద్ద - 1 /2 స్పూన్ 

* తాలింపు కొరకు -  ఎండు మిరపకాయ 1, అవాలు, జీలకర్ర, మెంతులు 

*ఇంగువ - కొద్దిగా 

* కరివేపాకు - 1 రెబ్బ 

* నూనె - కొద్దిగా

తయారు చేసే విధానం :

* ముందుగా దూట మొదట చక్రాలుగా తరిగి .... తిరిగి దానిలోని పీచునుతీస్తూ చిన్నముక్కలుగా తరుగు కోవాలి. 

* ఈ ముక్కలు నల్లబడకుండా  పలుచని మజ్జిగతో కడిగి నూనెలో కొద్దిగా మగ్గనివ్వాలి.

* మగ్గి చల్లారనిచ్చాక..పోపు గింజలు వేయించి.. అది కూడా చల్లారిన తరువాత  పెరుగు కొద్దిగా గిలకొట్టుకుని చిక్కని పెరుగుతోనే ఈ దూట ముక్కలు పోపు, ఉప్పు, పసుపు వేసి కొత్తిమీరతో అలంకరించుకోవాలి. 

* అల్లం పచ్చిమిర్చి ముద్దని పోపుతో పాటు పచ్చివాసన పోయేలా  వేయించుకోవాలి. ఈ దూట ఆరోగ్యానికి చాలా మంచిది