క్రీమ్ పొటాటో సలాడ్

 

 

కావలసిన పదార్ధాలు:

బంగాళాదుంపలు - 1/4 కిలో 

పుల్లటి క్రీమ్ - 2 టీ స్పూన్స్

ఉల్లికాడల ముక్కలు - 1 స్పూన్ 

ఆలివ్ ఆయిల్ - 1 స్పూన్ 

ఉప్పు - సరిపడ

పెప్పర్ - రుచికి సరిపడ


తయారుచేయు విధానం:

ముందుగా ఉప్పు కలిపిన నీటిలో బంగాళదుంపలను ఉడికించి వార్చాలి.


తరువాత పొట్టంతా తీసి అర అంగుళం సైజులో పీసెస్ కట్ చేయాలి.


వాటిని  ఒక బౌల్‌లో పెట్టి వాటిపై వెనిగర్, ఆయిల్ వేసి కలిపి బాగా చల్లారనివ్వాలి.


క్రీమ్ బాగా గిలకొట్టి బంగాళాదుంప ముక్కలకి పట్టించాలి.
 

చివరగా సరిపడా ఉప్పు, పెప్పర్ లను జత చేసి పైన కొత్తిమీరను చల్లి సర్వ్ చెయ్యాలి.