కార్న్ కోఫ్తా కర్రీ
కావలసినవి:
కార్న్ - ఒక కప్పు
బియ్యప్పిండి - 2 స్పూన్లు
దాల్చినచెక్క - చిన్నముక్క
జీలకర్ర - పావు స్పూను
పసుపు - చిటికెడు
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - తగినంత
నూనె - తగినంత
లవంగాలు - 4
శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు
ధనియాలు - టేబుల్ స్పూను
పల్లీలు - కొన్ని
పచ్చిమిర్చి - 2
కారం - ఒకటిన్నర స్పూన్
ఉల్లిపాయలు - 2
టొమాటోలు - 2
తయారీ:
ముందుగా మొక్కజొన్నలను గ్రైండ్ చేసి, దానిలో ఉప్పు, కారం, శనగపిండి, బియ్యప్పిండి, ఉల్లిపాయ తరుగు వేసి బాగా కలిపి చిన్నచిన్న ఉండలుగా చేసి ప్లేట్ లో పెట్టుకుని తరువాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి కాగాకా నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
గ్రేవీ తయారీ:
బాణలిలో రెండు స్పూన్ల నూనె వేసి ధనియాలు, పల్లీలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించి చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. అదే బాణలిలో నూనె వేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి చల్లారిన తరిగిన టొమాట ముక్కలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి, కాగాక జీలకర్ర వేసి వేయించి అల్లంవెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో నిముషం వేయించి, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను దీనిలో కలిపి ఉప్పు, పసుపు, కారం, సరిపడా నీళ్ళు పోసి పది నిముషాలు ఉడికించాలి. తరువాత ముందుగా వేయించి పెట్టుకున్నకోఫ్తాలను వేసి దించేయాలి రెండు నిముషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమిరతో గార్నిష్ చేసి రైస్ కానీ చపాతితో కానీ సర్వ్ చేసుకోవాలి.