కార్న్ బిర్యాని

 

 

 

కావల్సిన పదార్థాలు:

కార్న్(మొక్కజొన్న): 1½ cup

ఉల్లిపాయ: 1

టమోటో: 2

అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 స్పూన్

పచ్చిమిర్చి: 5

నూనె: 3 స్పూన్స్

నెయ్యి: 3 స్పూన్స్

కొబ్బరి పాలు 1cup

నీళ్ళు: 3 cups

ఉప్పు: రుచికి సరిపడా

కారం: 2 స్పూన్స్

పసుపు: ½ స్పూన్స్

కొత్తిమీర : 2(chopped)

పుదీనా : తగినంత

గరం మసాలా: 2tsp

బిర్యానీ ఆకు: 1

చెక్క: 2

లవంగాలు :5

యాలకులు :3

బాస్మతి రైస్: 2 cups

 

తయారు చేయు విధానం:

1. ముందుగా రెండు కప్పుల బాస్మతి బియ్యాన్ని అరగంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి. తర్వాత నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు మందపాటి డీప్ బాటమ్ పాత్రను స్టౌ మీద పెట్టి ఆయిల్ , నెయ్యి వేసి కాగిన తర్వాత అందులో బిర్యాని ఆకు, చెక్క, లవంగాలు మరియు యాలకులు వేసి వేయించాలి.

3. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకూ వేయించుకోవాలి.

4. ఉల్లిపాయ ముక్కలు రంగు మారే సమయంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు టమోటో వేసి, టమోటో మెత్తబడే వరకూ ఉడికించుకోవాలి.

5. తర్వాత మొక్కజొన్న గింజలు, పసుపు, కారం, కొబ్బరి పాలు మరియు ఉప్పు వేసి మరో ఐదు నిముషాలు వేయించాలి. ఈ మిశ్రమం అంతా చిక్కబడేంత వరకూ వేయించుకోవాలి.

6. ఇప్పుడు ఇందులో రెండు కప్పుల నీళ్ళు వేసి ఈ గ్రేవీని బాగా ఉడికించాలి. తర్వాత ఇందులో బాస్మతి బియ్యాన్ని, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి బాగా ఉడికించాలి. అంతే కార్న్ బిర్యానీ రెడీ. కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.

కార్న్ బిర్యాని రైతా లేదా వెజిటేబుల్ గ్రేవీతో సర్వ్ చేయాలి.