కాలీ ఫ్లవర్ మంచూరియా రెసిపి
కావలసిన పదార్థాలు:-
కాలీ ఫ్లవర్ - ఒకటి
మైదా - 3 చెంచాలు
కార్న్ ఫ్లోర్ - తగినంత
నూనె - సరిపడా
అజీనామోటో - సరిపడా
ఉల్లికాడలు - కొన్ని
ఉప్పు - తగినంత
కారం - తగినంత
పసుపు - చిటికెడు
రెడ్ కలర్ - తగినంత
కొత్తిమీర - ఒక కట్ట
టమోటా సాస్, సోయా సాస్, చిల్లీ సాస్ - సరిపడగా తీసుకోవాలి
తయారు చేసే పద్ధతి:-
* కాలీ ఫ్లవర్‌ను పువ్వుల్లా కట్ చెయ్యాలి.ఒక బౌల్ తీసుకుని మైదా, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, కలర్ కలుపుకోవాలి.
* తర్వాత ఒక గిన్నిలో నూనె వేడిచేసుకుని బాగా కాగాక కలిపిన మిశ్రమంలో కాలీ ఫ్లవర్‌ను ముంచి నూనెలో ఎర్రగా వేయించాలి.
* తర్వాత వేరే మూకుడులో నూనె వేసి వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి.
* అందులో సోయా సాస్, టమోటా సాస్, చిల్లీ సాస్, అజీనామోటో వేసి బాగా కలిపి ఉంచుకోవాలి తర్వాత వేయించిన కాలి ఫ్లవర్ ను ఇందులో వెయ్యాలి
* పైన కొత్తిమిర తో అలంకరించుకోవాలి అంతే కాలి ఫ్లవర్ మంచూరియా రెడీ .