కాలీఫ్లవర్ చపాతీలు

 

 

 

 

కావలసినవి
గోధుమ పిండి - రెండు కప్పులు.
ఉప్పు- తగినంత.
నూనె - తగినంత.
కాలీఫ్లవర్ (తురుము ) రెండు కప్పులు.
పచ్చిమిర్చి- రెండు
కొత్తిమీర - కొద్దిగా
కారం - అర టీ స్పూను.
ఉప్పు - తగినంత.

 

తయారీ:
ముందుగా గోధుమపిండిలో  ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. వేరొక గిన్నె తీసుకుని అందులో కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, తురిమిన కాలిఫ్లవర్ , కారం వేసి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని  చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని  చపాతీలు ఒత్తుకుని  దాని మధ్యలో కాలిఫ్లవర్  మిశ్రమాన్ని ఉంచి చపాతీ  అంచులు మడిచి చపాతీ  చేయాలి. ఇలా అన్నిటిని చేసుకుని  స్టవ్ పై పెనం పెట్టి వేడయ్యాక చపాతీని వేసి నూనె వేసి రెండువైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి.