క్యారెట్‌ మసాలా రైస్‌

 

 

 

కావలసినవి:

క్యారెట్‌ - మూడు
బాసుమతి రైస్ -  ఒకటిన్నర కప్పు (వండినది)
అల్లం - కొద్దిగా
ఉప్పు - తగినంత
మసాలా పౌడర్ -  ఒక స్పూన్‌
ఆవాలు - అరస్పూన్‌
మిరియాలు పావు స్పూన్‌
క్యాప్పికం - రెండు

 

తయారుచేసేవిధానం :
ముందుగా క్యారెట్‌ను సన్నగా తరిగి క్యాప్సికంను చిన్నముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి, కాగాక  ఆవాలు, ఇంగువ వేసి వేగిన తరువాత క్యారెట్‌, క్యాప్సికం, అల్లం ముక్కలు, మసాలా  పౌడర్‌ వేసి బాగా కలపాలి. క్యారెట్ వేగాక ఉప్పు వేసి కలిపి సరిపడా  నీళ్లు పోసి చిన్న మంట మీద ఒక పది నిముషాలు మీద  ఉంచాలి. ఇప్పుడు వండిన  అన్నం వేసి అందులో పెప్పర్ వేసి కలపాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని  వేడి వేడి గా సర్వ్ చేసుకోవాలి....