క్యారెట్ ఫ్రై

 

 

 

కావలసినవి :
క్యారెట్లు : పావు కేజీ
నూనె :  సరిపడా
పచ్చిమిర్చి : ఐదు
కరివేపాకు : కొద్దిగా
పెరుగు : కప్పు
అల్లం వెల్లుల్లి : ఒక స్పూన్
ఉప్పు : సరిపడా
మైదా : కప్పు
శనగపిండి : కప్పు
కారం : ఒక స్పూన్

 

తయారీ :
ముందుగా గిన్నెలో మైదా, అల్లం, వెల్లుల్లి,శనగ పిండి, ఉప్పు,కారం, పెరుగు వేసి  పిండిని కొంచం గట్టిగా కలిపి పక్కనపెట్టుకోవాలి. క్యారెట్లు నిలువుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి కాగాక  శనగపిండి మిశ్రమంలో క్యారెట్ ముక్కలు ముంచి కాగే నూనెలో  వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి వేరొక గిన్నె పెట్టుకుని  కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చి ,కరివేపాకు వేసి వేగిన తరువాత వేయించి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసి  రెండు నిముషాలు వేయించి సర్వింగ్  లోకి తీసుకోవాలి