క్యాప్సికం బజ్జి

 

 

 

 

కావలసినవి :
క్యాప్సికం -2
శనగ పిండి : ఒకటిన్నర కప్పు
పసుపు : అరస్పూన్
కారం : 1 /2టీ స్పూన్
ఇంగువ : చిటికెడు
జీలకర్ర పొడి : అర టీస్పూన్
ఉప్పు : తగినంత

 

తయారీ :
ముందుగా క్యాప్సికం  కడిగి, కట్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నె లో శనగ పిండి,  కారం, జీలకర్ర పొడి, ఉప్పు, ఇంగువ వేసి సరిపడా నీళ్ళు వేసి బజ్జిలా పిండి లా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి కాగాక కట్ చేసుకున్న క్యాప్సికం ముంచి, నూనె లో వేయాలి. బ్రౌన్ గా వేగాకా ప్లేట్ లోకి తీసుకుని సాస్ తో సర్వ్ చేసుకోవచ్చు...