బట్టర్ నాన్ రెసిపి!

 

కావలసినవి:

మైదా         : రెండు కప్పులు

బ్రెడ్ పొడి  : ఒక స్పూన్

వేడి నీళ్ళు : ఒక కప్

బట్టర్         : 100 గ్రాములు

పంచదార  : ఒక స్పూన్

తయారీ :

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదాను వెయ్యాలి. వేడి నీళ్ళు తీసుకుని అందులో బ్రెడ్ పొడి కలపాలి అందులో స్పూన్ సాల్ట్ ఇంకా పంచదార కలుపుకోవాలి

ఈ మిశ్రమంలోనే పాలు నూనేను కూడా వేసుకుని బాగా బ్లెండ్ చెయ్యాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మైదా లో వేసి కలపాలి పిండి మరి గట్టిగా కాకుండా చేతికి అంటుకునేలా కలుపుకోవాలి.

ఒక రెండు నిముషాలు ఆగి పిండిని ఉండలుగా చేసుకోవాలి అన్నిఉండలు  సమానంగా చేసుకోవాలి .తరువాత ఉండను తీసుకుని చపాతీల్లా చేసుకోవాలి. చపాతీలా చేసిన దానిమీద బట్టర్ రాయాలి.

ఇప్పుడు మధ్యలోకి ఫోల్డ్ చెయ్యాలి పైన మళ్ళి బట్టర్ రాయాలి. మళ్ళి త్రిభుజాకారంలో మడత పెట్టి ఇంకొకసారి బట్టర్ ని రాయాలి. తరువాత చేతితో కొంచం పెద్దగా వచ్చేల వత్తుకోవాలి.

ఇక్కడ నాన్ ని కాల్చడానికి ప్యాన్ కంటే కూడా ఐరన్ గ్రిల్స్ మీద కాలిస్తే రుచి బావుంటుంది.గ్రిల్ మీద బ్రౌన్ కలర్ వచ్చేవరకు రెండు పక్కలా కాల్చుకోవాలి.