బ్రింజాల్ బటర్ మసాలా

 

 

 

కావలసిన పదార్థాలు :

పొడవు వంకాయలు... అర కేజీ

ఎండుమిర్చి... పది

మినప్పప్పు... నాలుగు టీస్పూన్లు

ధనియాలు.... ఒక టీ.

ఉల్లిపాయలు... నాలుగు

వెన్న... వంద గ్రాములు

ఉప్పు... తగినంత

నూనె... మూడు టీస్పూన్లు

 

తయారీ విధానం :

వంకాయలను గుత్తి వంకాయ మాదిరిగా మధ్యలోకి కోసి ఉప్పునీటిలో వేయాలి.

ఓ బాణలిలో కొద్దిగా నూనె పోసి మినప్పప్పు, ఎండుమిర్చి, ధనియాలు వేసి దోరగా వేయించాలి.

వీటిని మిక్సీలో వేసి గరుకుపొడిలా చేయాలి.

తరువాత ఉల్లిముక్కలను కూడా వేసి ముద్దలా చేసి అందులో తగినంత ఉప్పు, వెన్న కలపాలి.

ఇప్పుడు ఒక్కో వంకాయలో మసాలా కూరి ఉంచాలి.

తరువాత అడుగు మందం ఉండే గిన్నెలో కొద్దిగా నూనె వేసి వంకాయలను ఒకదానిపక్కన ఒకటి అమర్చి, మూతపెట్టి, సన్నటి మంటమీద మగ్గనిచ్చి దించేయాలి.

అంతే వేడి వేడి వంకాయ వెన్న మసాలా సిద్ధమైనట్లే...!