బ్రెడ్ చాట్
కావలసినవి:
బ్రెడ్ - 1 ప్యాకెట్
బంగాళదుంప - 1 కప్పు (ఉడికించినవి)
టమాటా ముక్కలు - అరకప్పు
ఉప్పు - సరిపడా
చాట్ మసాలా - స్పూన్
పచ్చి బఠాణీలు - అరకప్పు
ఉల్లిముక్కలు - అరకప్పు
చింతపండు గుజ్జు - స్పూన్
సన్న కారప్పూస - అరకప్పు
కారం - పావు స్పూన్
కొత్తిమీర - సరిపడా
తయారీ విధానం:
ముందుగా పచ్చి బఠాణీలు ఉడికించి అందులో పసుపు, ఉప్పు, కారం, చాట్ మసాలా, చింతపండు గుజ్జు కలిపి సరిపడా నీళ్లు పోసి చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు, కొత్తిమీర తరుగు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం మీద బ్రెడ్ ముక్కలు వేయించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని వీటిమీద చాట్ పెట్టి, ఉల్లి ముక్కలు, సన్న కారప్పూస, కొత్తిమిర వేసి సర్వ్ చేసుకోవాలి....