బ్రెడ్ బాత్

 

 

కావలసిన పదార్థాలు:
బ్రెడ్ స్లైసులు :పది
క్యారెట్: 2
కొత్తిమీర: ఒక కట్ట
బీన్స్: అర కప్పు(కట్ చేసినవి)
బీట్ రూట్: 1
జీడిపప్పు: అర కప్పు
ఆవాలు:  ఒక స్పూన్
ఉప్పు: రుచికి తగినంత
పచ్చిబఠాణీలు-ఒక కప్పు
పచ్చిమిర్చి: ఐదు
ఉల్లిపాయలు: రెండు
పసుపు: చిటికెడు
నూనె : తగినంత
శనగపప్పు - ఒక స్పూన్
అల్లం: చిన్న ముక్క
మినపప్పు : ఒక స్పూన్

 

తయారు చేయు విధానం:
ముందుగా బఠాణీలు, కూరగాయల ముక్కలు ఉడికించుకోవాలి.తర్వాత బ్రెడ్ స్లైసులను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.తర్వాత ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి.తరువాత స్టవ్ పై పాన్ పెట్టి అందులో జీడిపప్పు దోరగా వేయించి పక్కన పెట్టుకుని అదే పాన్ ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, బ్రెడ్ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలుపుకుని కొద్దిసేపు  తర్వాత ఉడికించిన  బఠాణీలు , కూరగాయ ముక్కలు  కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే పాన్ పెట్టి  ఆయిల్ వేసి  శెనగపప్పు, మినపప్పు,ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి. చివరగా వేయించుకున్నజీడిపప్పు, కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లో వేసుకోవాలి.