షడ్రుచుల కాకరకాయ కూర
ఉగాది దగ్గరపడుతోంది అనగానే మనలో కూడా తెలియని ఆనందం. అన్ని రుచులు కలుపుకుంటూ చేసుకునే వంటలతో ఉగాదికి స్వగతం పలుకుదాం. చేదుగా ఉండే కాకరకాయలో పులుపు, ఉప్పు, కారం, తీపి, ఆమ్చూర్ పొడి కలిపి ఆరు రుచులు కలిసేలా మంచి టేస్టీ కర్రీ తయారుచేసుకుందామా...
కావలసిన పదార్థాలు
కాకరకాయలు - పావుకిలో
చింతపండుగుజ్జు - 3 చెంచాలు
బెల్లం - 2 చెంచాలు
ఆమ్చూర్ పొడి - 1/4 చెంచా
ఉప్పు, కారం - తగినంత
పోపు దినుసులు - కొద్దిగా
కరివేపాకు - 2 రెమ్మలు
తయారి విధానం
ముందుగా కాకరకాయలను కడిగి, తుడుచుకుని గుండ్రని చక్రాలుగా తరిగి పెట్టుకోవాలి. ఈ కూర తయారుచెయ్యటానికి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో నూనే వేసి వేడెక్కాకా పోపు దినుసులు వేయాలి. అవి వేగ్గకా ఇంగువ కరివేపాకు వేసి తరిగిన కాకరకాయ ముక్కలు వెయ్యాలి. అందులో ఉప్పు, చింతపండు గుజ్జు వేసి కాసిని నీళ్ళు పోసి మూట పెట్టి ముక్కలని మగ్గనివాలి. ముక్క కాస్త మెత్తబడ్డాకా అందులో బెల్లం తురుము వెయ్యాలి. అన్ని కలిసి కూర కాస్త పాకం పాటినట్లు ముద్దగా వస్తుంది అప్పుడు ఆమ్చూర్ పొడి, కారం వేసి అంతా బాగా కలిపి ఒక రెండు నిమిషాలు మూట పెట్టి మగ్గనివ్వాలి. ఇలా చేయటం వల్ల అన్ని రుచులు ఒకదానికి ఒకటి అంటుకుని మూట తీసేసరికి కూర ఘుమఘుమలాడుతూ ఉంటుంది. షడ్రుచులతో కలగలిసి కాకరకాయ కూర అమోఘంగా ఉంటుంది. కావాలంటే మీరే రుచి చూసి చెప్పండి.
...కళ్యాణి