బెండకాయ కుర్మా

 

 

 

కావలసిన పదార్ధాలు:

పావుకిలో బెండకాయలు,

ఒక ఉల్లిపాయ,

రెండు టమాటాలు,

అల్లం వెల్లుల్లి పేస్టు అర టీ స్పూన్,

కారం పొడి ఒక టీ స్పూన్,

ధనియాల పొడి ఒక టీ స్పూన్,

చిటికెడు పసుపు,

కొబ్బరి తురుము ఒక టేబుల్ స్పూన్,

నూనె ఒక టేబుల్ స్పూన్,

ఆవాలు,

కరివేపాకు,

దనియ ఆకులు.

 

తయారు చేసే విధానం:

ముందుగా బెండకాయలను శుబ్రంగా కడిగి ఆరబెట్టాలి.

ఆరాక ఒక్క ఇంచ్ పరిమాణంలో వాటిని తరగాలి.

తరువాత వాటిని పెనం మీద దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

ఆ తరువాత ఒక కడాయి లో నూనె పోసి వేడి చేసి అందులో ఆవాలు, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ వేసి గోదుమరంగు వచ్చేవరకి వేయించాలి.

తరువాత తరిగిన టమాటాలు, కారం పొడి, ధనియాల పొడి, పసుపు, తగినంత ఉప్పు వేసి వండాలి.

ఆ తరువాత తరిగిన బెండకాయ ముక్కలను వేసి కలిపి వండాలి.

దానికి కొబ్బరి తురుము, కొన్ని నీళ్ళు పోసి పెద్ద మంటపై మరో ఐదు నిముషాలు వండాలి.

మరో పది నిముషాలు ఉడికాక గ్రేవీ గట్టి పడుతుంది. అంతే ఇక ఘుమఘుమలాడే బెండకాయ కుర్మా రెడీ.