బీట్రూట్ పూరీలు

 

 

 

 

కావలసినవి:
బీట్‌రూట్ - ఒకటి
గోధుమ పిండి - పావుకిలో
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా

 

తయారీ :
ముందుగా బీట్‌రూట్‌ని శుభ్రంగా కడిగి తొక్కతీసి కట్ చేసుకుని ఈ ముక్కల్ని ఉడికించుకోవాలి . ముక్కలు చల్లారాక  మిక్సీలో వేసి గ్రైండ్ చేసువాలి.ఇప్పుడు ఈ బీట్రూట్ పేస్ట్ లో కొద్దిగా నీటిని వడకట్టుకోవాలి. తరువాత గోధుమ పిండిలో తగినంత ఉప్పు, కొద్దిగా నూనె, సరిపడా బీట్రూట్‌ నీళ్లు పోసి కలుపుకుని ఒక పదిహేను నిముషాలు పిండిని నానపెట్టి  తరువాత ఉండలు పూరీలు చేసుకుని వేడి నూనెలో కాల్చుకుని సర్వ్ చేసుకోవాలి.