బీరకాయ కొబ్బరి పాలకూర
కావలసిన పదార్ధాలు:
బీరకాయలు - 1/2 kg
ఉల్లిపాయలు - 2
కొబ్బరిపాలు - 1 కప్పు
ఉప్పు - 1/4 చెంచా
కారం - 1/4 చెంచా
ధనియాలపొడి - 1/2 చెంచా
జీలకర్రపొడి - 1/2 చెంచా
జీలకర్ర - 1/4 చెంచా
కరివేపాకు - 4 ఆకులు
నూనె - 6 చెంచాలు
తయారీ విధానం:
* బీరకాయలు కడిగి తొక్క తీసి పెద్ద ముక్కలుగా చేసి వాటిని గుత్తులుగా కోసుకోవాలి.
* పొయ్య ఫై బాణలి పెట్టి వేడి అవుతుండగా నూనె వేసుకొని తరిగి ఉంచుకున్న ఉల్లి ముక్కల్ని వేయాలి.
* అవి దోరగా కమ్మని వాసన వచ్చేవరకు వేయించుకొని కరివేపాకు వేసుకొని ..అవి చిటపట లాడుతుండగా జీల కర్ర వేసుకొని బీర గుత్తులను వేసి ఉప్పు పసుపు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి.
* గుత్తులు విడిపోకుండా ప్రక్కలనుండి కలుపుతూ .....బీరకాయ లోపలి వరకు ఉడకనివ్వాలి.
* మూత పెడుతూ, తీస్తూ నీరు ఆవిరి అవనిచ్చి ధనియాల పొడి, జీలకర్ర పొడ, కారం వేసి జాగ్రత్తగా కలిపి.
* పూర్తిగా ఈ మసాలాలు బీర గుత్తులకు పట్టాక.. పొయ్య మీద నుంచి దింపి.. కొబ్బరి పాలు వేసి బాగా కలిపి ...కొత్తిమీరతో అలంకరించుకోవాలి.
* ఈ కూర చపాతీలలోకి ,అన్నంలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది .