బీన్స్ కర్రీ రెసిపి

 

 

 

కావలసినవి:

బీన్స్ - 150 గ్రాములు

ఉల్లిపాయలు - 1

టమోటాలు - 2

అల్లం వెల్లుల్లి పేస్టు - 1 స్పూన్

పసుపు - అర స్పూన్

కారం - ఒక  స్పూన్

ఉప్పు - సరిపడా

నూనె - తగినంత

 

తయారు చేసే విధానము :

ముందుగా బీన్స్ ని సన్నగా కట్ చేసి ఉడకించి పక్కన పెట్టుకోవలెను.

తరువాత స్టవ్ వెలిగించి పాన్ లో తగినంత నూనె పోసి కాగాక అందులోకట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసి గోల్డెన్ కలర్ వచేవరకు వేయించి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి.

తరువాత కట్ చేసిన టమోటా ముక్కలను కూడా వేసి అన్ని బాగా ఉడికించాలి.

ఇప్పుడు ఉడికించుకున్న బీన్స్ కూడా వేసుకొని ఉప్పు ,కారం కొద్ది నిముషాలు ఉడికించి దించేసుకోవాలి.