బఠాణీ కర్రీ రెసిపి

 

 

 

 

కావలసిన పదార్థాలు:

పచ్చి బఠాణీలు: అర kg

నెయ్యి: 2 టీస్పూన్స్

ఉప్పు: సరిపడా

కొత్తిమీర : కొద్దిగా

ఇంగువ: చిటికెడు

జీలకర్ర:1 న్నర టీస్పూన్స్

పసుపు: 1 టీస్పూన్

కారం: 1/4 టీస్పూన్

ఎండుమామిడి పొడి. 1/4 టీస్పూన్

 

తయారు చేయు విధానము :

బాణెలిలో నెయ్యి వెయాలి. తరవాత ఇంగువ, జీలకర్ర, పసుపు, కారం వేసి పచ్చిబఠాణీలు వేసి తిప్పాలి.

తర్వాత నీళ్లు పోసి మూతపెట్టి సిమ్‌ వుంచి ఉడికించాలి.

బఠాణీలు ఉడికాక ఉప్పు, ఎండుమామిడికాయ పొడి వేసి కలిపి, కొత్తిమీర వేసి దించెయ్యాలి.