బఠాణి చాట్

 


కావలసినవి:

ఎండుబఠాణి - 2 కప్పులు ( నానబెట్టినవి)

బేకింగ్ సోడా - అరస్పూన్

చిటికెడు - ఇంగువ

ఆలూ దుంపలు - 2

ఉల్లిపాయ -1

టమాటా -1

కీరదోస - 1

నిమ్మ రసం - కొద్దిగా

చాట్ మసాలా - ఒక స్పూన్

ఉప్పు - తగినంత

కారం - ఒక స్పూన్

గరం మసాలా పొడి - ఒక స్పూన్

జీల కర్ర పొడి -  అరస్పూన్



తయారీ విధానం:

ముందుగా వెడల్పాటి పాన్లో నాన బెట్టిన బఠాణి వేసి నీళ్ళు, సోడా, ఇంగువ వేసి దాదాపు మెత్తగా ఉడికించాలి.

 

తరువాత  స్టవ్ వెలిగించుకుని బఠానీలను ఒక గిన్నె లోకి తీసుకుని, గరం మసాలా, కారం, చాట్ మసాలా,  ఉప్పు,  వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

 

ఇప్పుడు సర్వింగ్ ప్లేట్స్ లోకి చాట్  తీసుకుని టమాటా, ఉల్లిపాయ, నిమ్మరసం, కీర తో సర్వ్ చేసుకోవాలి....