బంగాళాదుంప వేపుడు
కావాల్సిన పదార్ధాలు:
బంగాళాదుంపలు - 1/2 Kg
మెంతులు - 1/2 టెబుల్ స్పూన్
ఎండు మిర్చి - 2
నూనె - 1/2 కప్పు
మెంతికూర తరుగు - 1 కప్పు
కారం - 1 టెబుల్ స్పూన్
ఉప్పు - తగినంత
ధనియాల పొడి - 1 టెబుల్ స్పూన్
తయారీ విధానం:
కడాయి లో నూనె వేడి చేసి, 30 నిమిషాలు నీళ్ళలో నానబెట్టిన ఆలూ గడ్డ ముక్కలు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ముక్కలు ఎర్రబడ్డాక పక్కకి తీసుకోండి. అదే నూనెలో మెంతులు ఎండుమిర్చి వేసి మెంతులు ఎర్రబడేదాకా వేపుకోవాలి. మెంతికూర తరుగు వేసి 2 నిమిషాలు వేపితే పసరు వాసన పోయి మెత్తగా వేగుతుంది. తరువాత ఆలూ గడ్డ ముక్కలు ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి. వేపుడు తయారయ్యాక గిన్నెలోకి తీసి జల్లెడతో కప్పి ఉంచుకుంటే క్రిస్పీగా వేగిన ఆలూ మెత్తబడదు. ఈ వేపుడు సాంబార్, రసం, పెరుగన్నం తో నంజుకుని తినడానికి చాలా బాగుంటుంది. టిప్స్: ఆలూని వేపే ముందు ఆలూ చెక్కు తీసి ముక్కలు చేసి నీళ్ళలో వేసి 30 నిమిషాలు వదిలేస్తే ఆలూలోని పిండి పోయి దుంపల వేపుడు కరకరలాడుతూ వస్తుంది.