అరటికాయ కబాబ్ 

 

 

 

కావలసిన పదార్థాలు:
అరటికాయలు - మూడు
ఉల్లిపాయ - ఒకటి
కొత్తిమీర - కొద్దిగా
జీలకర్ర, ధనియాలపొడి - అరచెంచా
గరంమసాలా - ఒక స్పూను 
మొక్కజొన్న పిండి - రెండు చెంచాలు
నిమ్మరసం - కొద్దిగా 
పచ్చిమిర్చి - మూడు
అల్లం - చిన్నముక్క
నునె,ఉప్పు, కారం - తగినంత
పసుపు - చిటికెడు

 

తయారుచేసే విధానం:
ముందుగా అరటికాయలను బాగా ఉడికించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసి  పెట్టుకోవాలి. ఉడికిన అరటికాయలను చల్లార్చుకొని తోలు తీసి మెత్తగా మెదపాలి. ఈ మిశ్రమంలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ధనియాలపొడి, పసుపు, మొక్కజొన్న పిండి, తగినంత ఉప్పు, కారం  కూడా వేసుకోవాలి.  నిమ్మరసం, కొత్తిమీర, గరంమసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న వుండలుగా చేసుకోవాలి. ఇప్పుడు స్టౌ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో తగినంత నునె పోసుకోవాలి.  నూనె వేడయ్యాక ఒత్తుకున్న అరటి ముద్దలను నూనెలో వేయించాలి. అంతే ఎంతో రుచికరమైన అరటికాయ కబాబ్ రెడీ. టీవీలో ఏదైనా ప్రోగ్రామో, సినిమానో చూస్తూ, వీటిని టొమేటో సాస్‌లో నంచుకుని తింటూ వుంటే... అబ్బ... ఆ టేస్టేంటో మీరే స్వయంగా తెలుసుకోండి.