బేబీ కార్న్ పన్నీర్  కర్రీ  రెసిపి

 

 

 

కావలసిన పదార్థాలు :
బేబీ కార్న్                 100 గ్రాములు
పన్నీర్                        50 గ్రాములు
టొమాటో తరుగు                పావుకప్పు
పుదీనా                              అరకప్పు
అజినమెటో                    అరటీస్పూన్
నూనె                              తగినంత
ఉప్పు                                తగినంత
కారం                           2 టీస్పూన్లు
జీడిపప్పు                  మూడు స్పూన్లు
గరం మసాలా                     టీస్పూన్
జీడిపప్పు                     గార్నిష్ కోసం
ఉల్లితరుగు                      పావుకప్పు
బటర్                       10 గ్రాములు
అల్లం వెల్లుల్ పేస్ట్       50 గ్రాములు
పసుపు                            కొద్దిగా

 

తయారుచేసే పద్ధతి :
ముందుగా  బేబీ కార్న్ ను గుండ్రముగా చక్రాల్లా  కట్ చేసుకోవాలి అలాగే  పన్నీర్ కూడా కట్ చేసుకుని  ప్లేట్ లో పెట్టుకోవాలి.తరువాత  స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్  వేసుకొని, కాగాక  పన్నీర్ ముక్కలు, బేబీ కార్న్ ముక్కలను వేసి బ్రౌన్  కలర్ వచ్చేవరకు వేయించుకుని పక్కకి తీసుకునిపెట్టుకుని అదే పాన్ లో కొద్దిగా ఆయిల్  వేసి ఉల్లితరుగు వేసి వేయించి,టామాటో ముక్కలు వేసి  వేగాక  అల్లం వెల్లుల్లి పేస్ట్,  వేసి బాగా కలిపి పది నిముషాలు ఉడికించాలి. తర్వాత గరం మసాలా, అజినమోటో, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు  జీడిపప్పు ను మిక్సిలో  వేసి పొడి చేసుకుని కర్రీ లో వేసుకోవాలి తరవాత  కారం, పసుపు  కొద్దిగా నీళ్ళు వేసి ఉడకనివ్వాలి కొద్దిసేపు ఆగి వేయించుకున్న పన్నీర్ ఇంకా బేబి కార్న్ ముక్కలు వేసి ఒక ఐదు నిముషాలు ఉడికించాలి.అంతే  అంతే బేబీ కార్న్ పన్నీర్  కర్రీ....