బేబికార్న్ మంచూరియా రెసిపి

 

 

 

కావలసిన పదార్ధాలు:
కార్న్ ఫ్లోర్  - అరకప్పు
బేబి కార్న్‌ - ఒక కప్పు
కారం - సరిపడా
అల్లంవెల్లుల్లి పేస్టు - 2 స్పూన్లు
ఉప్పు - తగినంత
బియ్యం పిండి - అర కప్పు
వెల్లుల్లి పాయ ముక్కలు - రెండు స్పూన్లు
సోయాసాస్‌ - రెండు స్పూన్లు
నూనె - సరిపడా
ఉల్లిపాయ - 1
టొమాటో సాస్‌ - రెండు స్పూన్లు

 

తయారు చేసే విధానం:
ముందుగా  బేబి కార్న్‌ను చిన్న  ముక్కలు కట్ చేసి  ఉప్పు వేసిన నీటిలో  ఉడికించి ఒక ప్లేట్ లోపెట్టుకోవాలి. తరువాత ఒక గిన్ని తీసుకుని కార్న్ ఫ్లోర్, బియ్యంపిండి, కారం, అల్లంపేస్ట్ , ఉప్పును వేసి  పిండిని కొంచం గట్టిగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి మూకుడు  పెట్టి ఆయిల్ వేసి కాగనివ్వాలి. ఇప్పుడు కలుపుకున్న మిశ్రమంలో ఉడికించుకున్న బేబి కార్న్‌ను వేసి ఆయిల్ లో బ్రౌన్  కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.తరువాత  స్టవ్  పై పాన్ పెట్టుకుని కొంచం ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, దోరగా వేయించుకోవాలి. అందులో వేయించి పెట్టుకున్న బేబికార్న్‌ ముక్కలను వేసి కలపాలి.ఇప్పుడు   సోయాసాస్‌, చిల్లీసాస్‌, టొమాటో సాస్‌ వేసి కలుపుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి...