బేబీ కార్న్ ఫ్రై

 

 

 

కావలసినవి
బేబీ కార్న్- 7
పసుపు-కొద్దిగా
నూనె-సరిపడా
మైదాపిండి - ఒక టీస్పూన్‌
బియ్యప్పిండి - ఒక టీస్పూన్‌
శనగపిండి-ఒక టీస్పూన్‌
జీలకర్ర,ధనియాలపొడి- ఒక టీస్పూన్‌
నిమ్మరసం-కొద్దిగా
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌- ఒకటిన్నర టీస్పూన్లు
ఉల్లిపాయ-ఒకటి
ఉప్పు-తగినంత
కారం - అరటీస్పూన్‌
కాప్సికమ్‌ - ఒకటి
టమాటా - ఒకటి

 

తయారుచేసే విధానం
ముందుగా బేబీ కార్న్ ను నిలువుగా నాలుగు ముక్కలుగా చీల్చుకుని ఉంచుకోవాలి. ఒక గిన్నె తీసుకుని మైదా, బియ్యం పిండి, శనగపిండి, పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం సరిపడా నీళ్లు పోసి కలిపి ఇందులో బేబీ కారం ముక్కల్ని వేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి గిన్నెపెట్టి నూనె పోసి కాగాక పిండిలో ముంచిన కార్న్ ను నూనె వేసి దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకుని వాటిపై జీలకర్ర, ధనియాలు పొడి వేసి  నిమ్మరసం ఉల్లిపాయ ముక్కలు, కాప్సికమ్‌, టమాటా, కొత్తిమీరతో గార్నిష్‌ చేసుని సర్వ్ చేసుకోవాలి