బేబీ కార్న్ 65
కావలసినవి :-
బేబీకార్న్ - ఒక కప్పు
శనగపిండి - ఒక కప్పు
మైదాపిండి - ఒక కప్పు
ఉప్పు, కారం - తగినంత
టమాటాసాస్ - అర కప్పు
వెల్లులిరెబ్బలు - నాలుగు
ఉల్లికాడ ముక్కలు - నాలుగు
బీన్స్ ముక్కలు - పావు కప్పు
కరివేపాకు - కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా
నూనె - తగినంత
తయారుచేసే విధానం:-
* ముందుగా బేబీకార్న్ ముక్కల్ని కట్ చేసుకుని వాటిని ఉప్పు వేసిన నీళ్లలో ఉడికించి నీళ్లల్లో నుంచి ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలి.
* తరువాత బీన్స్ కూడా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి.
* ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని శనగపిండి, మైదాపిండి సరిపడా ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్ళు పిండిలా కలపాలి.
* తరువాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నూనె వేసి కాగిన తరువాత కలిపివుంచుకున్న పిండిలో బేబీకార్న్ ముక్కల్ని ముంచి కాగుతున్న నూనెలో వేసి వేయించాలి.
* ఇలా అన్నింటిని వేయించి ఒక ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నాలుగు చెంచాల నూనె వేసి కరివేపాకు, వెల్లుల్లి వేసి వేగాక బేబీకార్న్ ముక్కల్ని వేయాలి.
* తర్వాత వాటికి టమాటాసాస్ కొత్తిమీర తురుము చేర్చాలి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లికాడలు, ఉడికించుకున్న బీన్స్‌ముక్కలు కూడా వేసి ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలి....