అటుకుల ఉప్మా
కావలసినవి:
అటుకులు - రెండు కప్పులు
అల్లం - చిన్న ముక్క
పచ్చిమిర్చి - నాలుగు
కరివేపాకు - రెండు రెబ్బలు
కొత్తిమీర - కొద్దిగా
జీడిపప్ప - ఐదు
పల్లీలు - కొద్దిగా
పోపుదినుసులు - కొద్దిగా
క్యారెట్ - ఒకటి
పసుపు - చిటికెడు
జీలకర్ర - కొద్దిగా
ఉల్లిపాయ - ఒకటి
ఉప్పు, నూనె - తగినంత
తయారుచేసే విధానం :
ముందుగా అటుకులు శుభ్రం చేసుకొని రెండుసార్లు కడిగి నీరు వంచి పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేసి పోపు దినుసులు, జీలకర్ర వేసి వేగిన తరువాత జీడిపప్పు, పల్లీలు కూడా వేసి దోరగా వేగనివ్వాలి. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ముక్కలూ వేసి కొద్దిగా వేగిన తరవాత క్యారెట్ ముక్కలు కూడా వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత రెండు కప్పుల నీరు పోసి, తగినంత ఉప్పు, కాస్తంత పసుపు చేర్చి మూతపెట్టి మరిగించుకోవాలి. ఈ మిశ్రమంలో అటుకులు వేసుకుని మూడు నిమిషాల పాటు ఉడికించాలి. అంతే రుచికరమైన అటుకుల ఉప్మా రెడీ.