అరటికాయ కోఫ్తా కర్రీ
కావలసినవి :
అరటికాయలు - 4
ఉల్లిపాయలు - 3
మిరియాల పొడి - అర స్పూన్
పెరుగు - కప్పు
ధనియాల పొడి - స్పూన్
జీడిపప్పు - 50 గ్రాములు
ఉప్పు - తగినంత
పుదీనా - కట్ట
గరం మసాల - అర స్పూన్
కొబ్బరి పొడి - ఒక స్పూన్
టమోటాలు - పావు కిలో
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 3 స్పూన్లు
పచ్చిమిరపకాయలు - 5
కొత్తిమీర - కట్ట
నూనె - సరిపడా
పసుపు - చిటికెడు
కారం - రెండు స్పూన్లు
తయారీ :
ముందుగా అరటికాయలను చెక్కు తీసి ఉడికించి మెత్తని పేస్టులా చేసుకోవాలి. తరువాత బాణలిలో నూనె పోసి వేగాక ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కొంచెం వేయించి అందులో ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. ఆ మిశ్రమంలో జీడిపప్పు పేస్టును కూడా వేసి కలపి ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించిపాన్ పెట్టి నూనె పోసి పోపు వేసుకుని అందులో గ్రైండ్ చేసిన ఉల్లిపాయ, టమోట పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ఉప్పు , గరం మసాల, ధనియాల పొడి, కొబ్బరి పొడి, పెరుగు జీడిపప్పు పేస్టు కొంచెం వేసుకుని ఉడికించాలి. కొంచెం ఉడికి నూనె పైకి తేలిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న అరటి కోఫ్తా బాల్స్‌ని అందులో వేసి ఉడికించి గ్రేవి చిక్కగా అయ్యాకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని చపాతితో కాని రైస్ తో కాని సర్వ్ చేసుకోవాలి...