అరటికాయ ఆవకూర
కావలసిన పదార్దాలు :
* అరటికాయలు - 2
* మిర్చి ఆకుపచ్చవి - ౩
* అల్లం - చిన్నగా తరిగిన ముక్కలు కొద్దిగా
* చింతపండు రసం - రుచికి తగినంత
* ఉప్పు - 1/2 చెంచాలు
* పసుపు - చిటికెడు
* ఇంగువ
* పోపుగింజలు
* తాలింపుకు నూనె
తయారు చేసే విధానం:
* ముందుగా ఉడికించి పొట్టు తీసి ముక్కలుగా చేసిన అరటికాయలను ప్రక్కన ఉంచుకోవాలి.
* ఆ తరువాత మూకుడులో నూనె వేసి తాలింపు దినుసులు వేసి మిర్చి, అల్లం, కరివేపాకు వేసి ఇష్టమైతే ఇంగువ కూడా జోడించి వేయించుకోవాలి. * పోపు వేగాక అరటికాయ ముక్కలు వేసి పసుపు, ఉప్పు, చింతపండు రసం జోడించి మూతపెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి.
* కూర బాగా కలిపి ఆవపొడి లేక ఆవముద్ద కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తరువాత ఆవపొడితో కూరను బాగాకలుపుకుని....అన్నంతో తినాలి చాలారుచిగా ఉంటుంది.