అరటిపువ్వు కర్రీ
కావాల్సిన పదార్థాలు:
అరటిపువ్వు - 500 గ్రాముల
బంగాళాదుంపలు - 100 గ్రాముల
పసుపు - అర టీస్పూన్
నూనె - రెండున్నర టేబుల్ స్పూన్ల
జీలకర్ర - కొద్దిగా
పచ్చిమిర్చి కారం - కావాల్సినంత
లవంగాలు - 3
అల్లం - అర టీస్పూన్
కొబ్బరి తురుము - 50 గ్రాముల
కారం - పావు టీస్పూన్
జీలకర్ర పొడి - టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
పంచదార - కొద్దిగా
నెయ్యి - ఒక టీస్పూన్
ఉప్పు
తయారు చేసే పద్దతి:
ముందుగా అరటిపువ్వును శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. ఉప్పు వేసి ఉడికించుకోవాలి. బంగాళాదుంపలు చిన్నచిన్నముక్కలుగా కోసుకుని వేయించుకోవాలి.
మూకుడులో నూనె పోసి, అది వేడి అయిన తరువాత జీలకర్ర, లవంగాలు, పచ్చిమిర్చి, కారం, యాలకులు వేసి ఒక నిమిషం వేయించుకోవాలి. ఆ తరువాత అల్లం, కొబ్బరి తురుమును కలపాలి.
ఒక నిమిషం తరువాత పొడి మసాలాలన్నీ కలిపి..కొద్దిసేపు వేగనిచ్చి అందులో ఇంతకు ముందు వేయించి పెట్టుకున్న బంగాళదుంపలు, అరటిపువ్వు కలిపి ఉడికించాలి.
ఉడికిన తరువాత నెయ్యి జల్లాలి. దాంతో వేడి వేడి అరటిపువ్వు కూర రెడీ..