ఆంధ్ర పెసరట్టు అల్లం పచ్చడి

 

 

పెసరట్టు కి కావలసినవి :

పెసరపప్పు - పావు కేజీ

అల్లం - చిన్న ముక్క

పచ్చిమిరపకాయలు - 10

ఉప్పు - 2 స్పూన్స్

జీలకర్ర - 2 స్పూన్స్

నెయ్యి - సరిపడా

ఉల్లిపాయలు - 2

 

తయారు చేసే విధానం :

ముందుగా పెసరపప్పుని 5 గంటలు నానబెట్టి శుభ్రంగా కడిగి అందులో పచ్చిమిరపకాయలు, ఉప్పు, అల్లం ముక్క వేసి మెత్తగ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ నీ వేడి చేసి దాని మీద పెసరట్టు వేసి, దాని పైన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేయ్యాలి. నెయ్యి పెసరట్టు చుట్టూ ఇంకా పెసరట్టు పైన వేయ్యాలి.

 

అల్లం పచ్చడి కావలసినవి :

శనగపప్పు - 2 స్పూన్స్

జీలకర్ర - 1 స్పూన్స్

చింతపండు - కొంచం

అల్లం - సరిపడా

ఉప్పు -ఒక స్పూన్

పచ్చిమిరపకాయలు - 10

బెల్లం - సరిపడా

నునె - 3 స్పూన్లు

 

అల్లం పచ్చడి తయారు చేసే విధానం :

పాన్ లో నునె వేసి అందులో శనగపప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఇప్పుడు అల్లం వేసి పచ్చి వాసనా లేకుండా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో చింతపండు , ఉప్పు , బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. గట్టిగా వుంటే కొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకున్న పెసరట్టు ఇంకా అల్లం పచ్చడితో కలిపి సర్వ్ చేసుకోవాలి.