ఆలూ వంకాయ కూర

 

కావాల్సిన పదార్ధములు:

వంకాయ ముక్కలు - 250 గ్రా

ఆలూ గడ్డ - 150 గ్రా

మునక్కాడ - ఒకటి

ఉల్లిపాయ తరుగు - రెండు

పచ్చిమిర్చి - రెండు

టమాటో - మూడు

అల్లం వెల్లులి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్

కరివేపాకు - రెండు రెబ్బలు

కొత్తిమీర - రెండు టేబుల్ స్పూన్స్

ఆవాలు - ఒక టేబుల్ స్పూన్

జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్

ఎండు మిర్చి - రెండు

ఉప్పు - తగినంత

పసుపు - పావు టేబుల్ స్పూన్

కారం - ఒక టేబుల్ స్పూన్

ధనియాల పొడి - ఒక టేబుల్ స్పూన్

జీలకర్ర పొడి - ఒక టేబుల్ స్పూన్

గరం మసాలా - అర టేబుల్ స్పూన్

నూనె - పావు కప్పు

చింతపండు - సరిపడ

తయారీ విధానం:

నూనె వేడి చేసి అందులో మునక్కాడ ముక్కలు వేసి 3-4 నిమిషాలు పాటు మగ్గనిచ్చి పక్కకి తీసుకోవాలి.

అదే నూనెలో వంకాయ ముక్కలు మరియు ఆలు గడ్డ ముక్కలు వేసి వంకాయ మెత్తగా, ఆలూ గడ్డ బంగారు రంగు వచ్చేదాకా వేపుకుని పక్కనపెట్టుకోవాలి.

తర్వాత అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేపుకోవాలి.

* ఉల్లిపాయ తరుగు , ఉప్పు , పసుపు వేసి మగ్గెవరకు వుంచాలి.

మగ్గిన ఉల్లిపాయల్లో అల్లం వెల్లులి పేస్టు వేసి వేపుకోవాలి, తరువాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, కొద్దిగా నీళ్లు పోసి మాడకుండా వేపుకోవాలి.

* టమాటో తరుగు వేసి గుజ్జుగా అయ్యేదాకా మగ్గనివ్వాలి.

* మగ్గిన టమాటోలో వేపిన ఆలూ, వంకాయా, మునక్కాడ ముక్కలు వేసి నెమ్మదిగా కలిపి మూత పెట్టి 4 నిమిషాలు మగ్గనివ్వాలి.

* మగ్గిన తరువాత చింతపండు పులుసు పోసి మునక్కాడ మెత్తబడేదాకా మూతపెట్టి మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి.

* కొత్తిమీర తరుగు గరం మసాలా వేసి కలిపితే మనకు కావాల్సిన ఆలూ వంకాయ కూర రెడీ.