ఆలూ స్టఫ్డ్ కాప్సికం
కావలసినవి :
కాప్సికం - ఎనిమిది
ఆలూ - 3
ఉల్లిపాయలు - 2
టమోటాలు - 2
జీలకర్ర - పావు టీ స్పూను
కారం పొడి - 1 టీ స్పూను
ఉప్పు - రుచికి తగినంత
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఎండుకొబ్బరి
గసగసాలు
గరం మసాలు - పావు కప్పు
తయారీ :
ముందుగా ఆలూని ఉడికించి తొక్కతీసి, మెత్తగా పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి కడాయిపెట్టి అందులో కొద్దిగా నూనె వేసి, జీలకర్ర, ఉల్లిపాయ, టమోటా ముక్కలు వేగించి, ఉప్పు, కారం వేసి వేగాకా ఆలూ ను కూడా వేసిఐదు నిమిషాలు మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు క్యాప్సికం కట్ చేసి లోపల గింజలు తీసేసి అందులో ఆలూ మిశ్రమంతో స్టఫ్ చేసి పక్కపెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి క్యాప్సికంలను వేయించి మగ్గాక గసగసాల పేస్ట్ వేసి ఒక ఐదు నిముషాలు మగ్గనివ్వాలి.