ఆలూ రైస్ రెసిపి

 

 

 

 

కావలసిన పదార్ధాలు:

బంగాళాదుంపలు : అర కేజీ

ఉల్లిపాయలు : 5

అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 3స్పూన్స్

ఉప్పు: 2 స్పూన్స్

యాలుకలు : 5

నెయ్యి: 3 స్పూన్స్

పచ్చి మిర్చి: 5

కారం: 2 స్పూన్స్

పసుపు : సరిపడా

 రైస్ : 2 కప్పులు

కాజు : 20 గ్రాములు

దాల్చిన చెక్క : 3

మిరియాల పొడి : తగినంత

పుదీనా : కొంచం

 

తయారీ విధానం :

ముందుగా ఉల్లిపాయలు , బంగాళాదుంపలు కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి కాగాక ఉల్లిపాయలు పచ్చి మిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి.

తర్వాత ఆలూ ముక్కలు కూడా వేసి కొంచం వేగాక కారం, పసుపు ,ఉప్పు , అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సరిపడా నీళ్ళుపోసి మగ్గనివ్వాలి.

ఈలోపు స్టవ్ మీద గిన్నిపెట్టి అందులో నెయ్యి వేసి ఉల్లిపాయలు ,అల్లం పేస్ట్,దాల్చిన చెక్క ,జీడి పప్పు వేసి ఫ్రై చేసాక రైస్ వేసి బాగా కలపాలి.

ముందుగా చేసిపెట్టుకున్న కర్రీ ని కూడా ఇందులో వేసుకుని బాగా కలలిపి  స్టవ్ ఆఫ్ చెయ్యాలి.

చివరిలో  పుదీనాతో అలంకరించుకుంటే ఆలూ రైస్ రెడీ..