ఆలూ పూరి రెసిపి
కావలసిన పదార్థాలు:
బంగాళదుంపలు: 5-6 ఉడికించి పొట్టుతీసి పెట్టుకోవాలి
జీలకర్ర: 2tsp
మైదా: 5-6cups
పచ్చిమిర్చి: 4-6
కొత్తిమీర తరుగు: 1/2cup
కారం: 1tsp
బ్లాక్ పెప్పర్(మిరియాలు) : 1/2tsp
నూనె: 2-3cups
నెయ్యి: 1-2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా ఉడికించిన, పొట్టు తీసిర పెట్టుకొన్న బంగాళాదుంపల్ని ఒక బౌల్లోనికి తీసుకొని బాగా చిదిమి పెట్టుకోవాలి.
2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ తీసుకొని, స్టౌ మీద పెట్టి అందులో జీలకర్ వేసి వేయించి, పక్కన తీసి పెట్టుకోవాలి.
3. తర్వాత ఒక గిన్నెలో మైదా పిండి వేసి అందులో ఉడికించి, చిదిమి పెట్టుకొన్న బంగాళదుంపను, వేయించి పెట్టుకొన్న జీలకర, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, కారం, బ్లాక్ పెప్పర్ మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పూరిల పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత ఈ పిండిలో కొద్దికొద్దిగా పిండిని తీసుకొని బాల్స్ లా చేసి చపాతీలా వత్తి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె, నెయ్యి పోసి బాగా కాగనివ్వాలి. నూనె బాగా కాగిన తర్వాత అందులో వత్తిపెట్టుకొన్న పూరీలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించి తీసి సర్వింగ్ బౌల్ పెట్టుకోవాలి.