ఆలు పరోటా
కావలసినవి:
గోధుమ పిండి - నాలుగు కప్పులు
ఆలు గడ్డలు - మూడు
ఉల్లిపాయ - ఒకటి
ఆవాలు - ఒక స్పూన్
జీలకర్ర - ఒక టీ స్పూన్
ఉప్పు - ఒక టీ స్పూన్
కారం - ఒక టీ స్పూన్
నూనె - తగినంత
తయారుచేసే విధానం:
ముందుగా ఆలు గడ్డలను కడిగి ముక్కలు కోసి కుక్కర్లో ఏడు విజిల్స్ వచ్చేవరకు పెట్టుకోవాలి. తరవాత ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకొని అందులో ఉప్పు, నూనె, కొంచెం నీళ్ళు పోసి మెత్తగా కలిపి చపాతి పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరవాత ఆలు గడ్డల పై పొట్టును తీసివేసి, ఆలుగడ్డను మెత్తగా మెదుపుకోవాలి. ఒక బాణలిని స్టౌ మీద పెట్టి అందులో కొద్దిగా నూనెపోసి అది కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు వేసి రెండు నిముషాలు వేపుకోవాలి. వేగుతున్న పోపులో ఆలు గడ్డల ముద్ద వేసి పసుపు, కారం, ఉప్పువేసి కలిపి రెండు నిమిషాలు తరువాత దించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చపాతి పిండిని వుండలుగా చేసి రొట్టి పీట మీద చిన్న చపాతిలా చేసి దాని పైన ఆలు గడ్డ ముద్దను పెట్టి నాలుగు వైపుల మూసి గుండ్రంగా చేసి చపాతీలా చేసుకొని పెనం మీద వేసి రెండు వైపుల నూనె వేసుకుంటు కాల్చుకోవాలి. అంతే! రుచిగా వుండే ఆలు పరోటా రెడీ.