ఆలూ పరాఠా రెసిపి
కావలసినవి :
బంగాళదుంపలు 2 పెద్దవి
గోధుమపిండి 3 cups
మైదా ఒక కప్
జీలకర్ర ఒక టీ స్పూన్
కారంపొడి ఒక టీ స్పూన్
గరంమసాలా ఒక టీ స్పూన్
కొత్తిమిర ఒక కట్ట
కరివేపాకు ఒక రెమ్మ
ఉప్ప ఒక టీ స్పూన్
నూనె సరిపడా
పెరుగు 3 టీ స్పూన్స్
పసుపు 1/4 టీ స్పూన్స్
తయారీ :
ముందుగా బంగాళదుంపలను ఉడికించి పొట్టు తీసి మెత్తగా చేసుకోవాలి.
ఇప్పుడు గోధుమపిండిలో కారంపొడి,జీలకర్ర,మైదా,గరం మసాలా,సన్నగా తరిగిన కరివేపాకు,కొత్తిమిర,పెరుగు ,పసుపు,బంగాళదుంప వేసి బాగా కలిపి నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలిపి అరగంట పక్కనపెట్టు కోవాలి.
తర్వాత చిన్నఉండలు చేసుకొని చపాతీల్లా చేసుకుని పెనం పి కాల్చుకోవాలి .