ఆలు పరోట

 

 

 

 

కావలసినవి
ఆలూ -  4
జీలకర్ర 1  స్పూన్
ఉప్పు - తగినంత
మైదా - ఒక కప్పు
ఉల్లిపాయలు - 2 
పచ్చిమిర్చి 4
కారం - 1  స్పూన్
నూనె - సరిపడా 

 

 తయారీ :
ముందుగా  మైదాను పూరి పిండిలా తడిపి ముద్దా చేసుకుని పక్కనపెట్టుకోవాలి. తరువాత ఆలూను ఉడికించి  మెత్తగా  చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు,పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి వేయించుకోవాలి జీలకర్ర వేయించి పౌడర్ చేసి కలపాలి ఆలూ ముద్దకూడా కలిపి తగినంత ఉప్పు,కారం వేసి కలిపి ఒక పది నిముషాలు మగ్గాక  స్టవ్ ఆఫ్ చెయ్యాలి మైదా పిండిని పూరిలచేసుకుని అందులో ఆలూ మిశ్రమాన్ని పెట్టి కవర్ చేసి పరోటాలు వత్తుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టుకుని చేసి పెట్టుకున్న పరోటాలను రెండువైపులా కాల్చుకోవాలి