ఆలూ పాలకూర కర్రీ
కావలసినవి:
పాలకూర - 1 కట్ట
ఆలూ - 2
అల్లం - చిన్నముక్క
టమోటాలు - 1
పచ్చిమిర్చి- 4
నిమ్మ రసం - రెండు స్పూన్లు
ఉప్పు - తగినంత
గరంమసాల - 1 స్పూన్
పసుపు - అర స్పూన్
నెయ్యి - మూడు స్పూన్లు
కారం - సరిపడా
ఇంగువ - చిటికెడు
ఉల్లిపాయలు -1
తయారీ :
ముందుగా పాలకూర కడిగి శుభ్రం చేసుకుని ఉడికించి పేస్ట్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఆలూ ను కూడా ఉడికించుకుని తొక్కు తీసి ముక్కలు కట్ చేసుకోవాలి.తరువాత స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి,అల్లం ముక్కలు ,టమోటా ముక్కలు వేసి వేగాక పసుపు,కారం, గరం మసాల వేసి పది నిముషాలు మగ్గనివ్వాలి. తరువాత ఆలూ ముక్కలు , పాలకూర పేస్టు ని వేసి ఒక ఐదు నిముషాల పాటు ఉడికించాలి. చివరిలో ఇంగువ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీ ని బౌల్ లోకి తీసుకుని నిమ్మ రసం కలుపుకోవాలి./p>