ఆలూ పాలక్ కర్రీ

 

 

కావలసిన పదార్ధాలు:

బంగాళదుంపలు - 1 / 4 

పాలకూర - ౩ కట్టలు చిన్నవి 

ఉల్లిపాయలు - 2  

పచ్చిమిర్చి - 4 

అల్లం, వెల్లుల్లిముద్ద - 1 టీస్పూన్ 

మసాలా పౌడర్ - 1 స్పూన్ 

ఉప్పు - తగినంత 

జీలకర్ర - కొద్దిగా 

నూనె - తగినంత

 

తయారుచేసే విధానం :

పాలకూర సన్నగా తరిగి ఉడికించి గరిటతో మెత్తగా మెదిపి పెట్టాలి.  బంగాళదుంపలు, ఉల్లిపాయలు చెక్కుతీసి ముక్కలు తరగాలి. ఇప్పుడు బాణలిలో నూనె మరిగాక జీలకర్రవేసి ఉల్లిపాయలు, బంగాళదుంప ముక్కలువేసి సన్నసెగలో మూతపెట్టి కొద్దిగా మగ్గించి.. అల్లం వెల్లుల్లిముద్దవేసి బాగా వేగాక ఉడికించిన పాలకూర వేసి  బాగా మగ్గించాలి. ఉప్పు,కారం, మసాలాపౌడర్ వేసి కలియబెట్టాలి. సన్నసెగలో కొద్దినీరుచేర్చి మగ్గించి దించాలి.