ఆలూ - గోబీ కర్రీ

 

 

 

కావలసిన పదార్థాలు :

ఆలుగడ్డలు - పావ్ కేజీ

టమాటాలు - పావ్ కేజీ.

గోబీ - ఒకటి

జీలకర్ర పొడి - 1 స్పూన్

నూనె : సరిపడా

ఉప్పు, కారం - తగినంత

వెన్న - రెండు స్పూన్లు

ఉల్లిగడ్డ - రెండు

పచ్చిమిరపకాయలు - మూడు

కార్న్‌ఫ్లోర్ - రెండు స్పూన్స్

జీడిపప్పు - 10 గ్రాములు

ధనియాలపొడి - 1 స్పూన్

 

తయారుచేయు విధానం:

గోబీ,ఆలుని ఉడకబెట్టికోవాలి. గిన్నెతీసుకుని అందులో ఉడికించిన గోబీ,ఆలూ కార్న్‌ఫ్లోర్ వేసి కలపాలి. జీడిపప్పు నానబెట్టి పేస్ట్ చేయాలి.

ఇప్పుడు గిన్నెలో నూనె పోసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. తర్వాత టమాటాలు,పసుపు,జీడిపప్పు పేస్ట్, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోయాలి.

కాసేపు ఆగి జీలకపూరపొడి,ధనియాలపొడి వేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఆలూ, గోబీ వేసి పదినిముషాలు ఉడకనివ్వాలి.

స్టవ్ అఫ్ఫ్ చేసుకుని దించేముందు వెన్న వేసుకోవాలి.