ఆలూ బ్రెడ్ కట్లెట్
కావలసినవి :
ఆలూ - నాలుగు
బ్రెడ్ - పది
ఉల్లిపాయలు - మూడు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్
కారం - ఒక స్పూన్
బఠానీలు - రెండు కప్పులు
టమోటాలు - నాలుగు
గరంమసాలా - ఒక స్పూన్
టమోటా సాస్ - కొద్దిగా.
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
నెయ్యి - సరిపడగా
తయారీ :
* ముందుగా బఠాణీ లను నానబెట్టుకోవాలి.తరువాత ఆలూని ఉడకబెట్టుకోవాలి.
* తరువాత బ్రెడ్‌ను నీళ్లలో ముంచి ఆ బ్రెడ్ ను ఉడకబెట్టిన ఆలూ లో వేసి కొంచెం పసుపు, కారం వేసి కలపాలి.
* ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల మాదిరిగా చేసుకుని పెనం మీద నెయ్యి లేక నూనె వేసి దోరగా కాల్చుకోవాలి.
* తరువాత నానబెట్టిన బఠాణీ లను కుక్కర్లో ఉడికించుకోవాలి.
* ఇప్పుడు టమోటాలు, ఉల్లిపాయలు ముక్కలు వేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి.
* తరువాత స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉడికించిన బఠాణీ వేసి గరంమసాలా, కొద్దిగా కారం , ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా ఉడికించుకోవాలి.
* రెడీ చేసిపెట్టుకున్న కట్లెట్లపై కర్రీ టమాటో సాస్ వేసి వేడి వేడి గా సర్వ్ చేసుకోవాలి....