జొన్న రవ్వ ఉప్మా

 

 

కావలసినవి:

జొన్న రవ్వ- ఒక కప్పు
ఆవాల - ఒక స్పూన్
శెనగపప్పు- ఒక స్పూన్
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
క్యారెట్ - ఒకటి
టొమాటొ - ఒకటి
నూనె -  కొద్దిగా

 

తయారీ :

ముందుగా జొన్న రవ్వ తీసుకుని అది ముదురు ఎరుపు రంగు వచ్చే వరకు వేగించి పక్కన పెట్టుకోవాలి. ఆవాలు, శెనగపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, టొమాటొ ముక్కల్ని కొద్దిగా నూనె వేసి అందులో వేగించాలి. అవి వేగిన తరువాత మూడు కప్పుల నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి. నీళ్లు మరిగిన తరువాత వేయించిన జొన్న రవ్వ నెమ్మదిగా కలుపుతూ పోయాలి. రవ్వ మెత్తగా అయ్యే వరకు సన్నటి మంట మీద ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి గా సర్వ్ చేసుకోవాలి.