![]() |
![]() |
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హైదరాబాద్ లోని రెండు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. రేవంత్ రెడ్డి చేసిన మార్చురీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖరరెడ్డి, కునా వివేకానందగౌడ్ లు పేట్ బషీర్ బాగ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారిరువురూ వ్యక్తిగతంలో పేట్ బషీర్ బాగ్ పోలీసు స్టేషన్ కు వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు.
ఇక రేవంత్ రెడ్డిపై ఫిల్మ్ నగర్ పోలీసు స్టేషన్ లో మరో ఫిర్యాదు దాఖలైంది. ఈ ఫిర్యాదును కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన దాసోసు శ్రవణ్ ఇచ్చారు. పీఎస్ లో రేవంత్ పై ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన దాసోజు కేసీఆర్ పై మార్చురీ కామెంట్లు చేయడంపై రేవంత్ ను తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ కేసీఆర్ హత్యకు ప్లాన్ చేస్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ విఫల హామీలపై నిలదీస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఖతం చేయాలనుకుంటున్నారా? అని నిలదీశారు. బెదరింపు రాజకీయాలను రేవంత్ మానుకోవాలని దాసోజు అన్నారు. అంతకు ముందు తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రేవంత్ రెడ్డి మార్చురీ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
![]() |
![]() |