Previous Page Next Page 
మిస్టర్ క్లీన్ పేజి 3

 

    "ఆ.... తెలిసింది" అంది ధైర్య.

 

    "నంద మానని ఫూల్ చేస్తున్నది" శ్రీవిద్య గొప్ప రహస్యం ఛేదించినాదానిలా ముఖం పెట్టి అంది.

 

    "ఇది ఏప్రియల్ నెలకాదు" గంభిర్యంగా అంది మహానంద.

 

    "సరే నీవు చెప్పింది నమ్ముతాము. అది చూపించు"

 

    "చూపిస్తే తప్ప నమ్మరన్నమాట?"


    
    "సాక్ష్యం లేకుండా ఎలా నమ్ముతాము?"

 

    "మంచి ప్రశ్నే వేశావు ధైర్య! ముందు దీనికి సమాధానం చెప్పు. ఎ. అనే వ్యక్తిని బి. అనే వ్యక్తీ గొంతు పిసికి చంపుతుండగా సి. అనే వ్యక్తి చూశాడు. కొంత కధ జరిగి కేసు కోర్టుకి వచ్చింది. సి అనే వ్యక్తి సాక్ష్యం యిస్తూ ఎ  అనే వ్యక్తిని బి అనే వ్యక్తి గొంతుపిసికి చంపుతుండగా చూశానని చెపుతాడు. సి అనేవాడు చెప్పే సాక్ష్యంతప్ప అక్కడ చనిపోయిన ఎ గాని ఎ ని చంపిన హంతకుడు బి గాని ఆ సమయంలో కోర్టులో వుండరు...

 

    మహానంధ సీరియస్ గా చెపుతుంటే ధైర్య మధ్యలో అడ్డుతగిలి :కోర్టులో ఎ శవం లేకపోవచ్చు కనీసం బోనులో హంతకుడు బి గారు అయిన వుండాలికదా, అక్కడ బి లేకుండా సి ఎలా సాక్ష్యం చెపుతున్నాదుట?" నవ్వుతూ అడిగింది.

 

    "ఎంత సి. ఎస్, రుబ్బినా తెలివి పెరగలేదు, బుర్ర పెరగటం తప్ప" మహానంధ ముద్దుగా కోప్పడింది. (సి.ఎస్, పరిశోధన.)

 

    "ఇంకానయం శరీరం ఎదుగుతూ బుర్ర ఎదక్కుండా గండుచీమ తలకాయ అంతే వున్నటయితే నన్ను తీసుకువెళ్ళి మ్యూజియంలో పెట్టేవాళ్ళు వింత వస్తువుల జాబితాలోకి చేర్చి." దైర్య నవ్వుతూ అంది.

 

    "యస్ మేడమ్!" మహానంద వినయంగా అని మళ్ళి చెప్పడం మొదలుపెట్టింది.

 

    "కోర్టులో ఎ శవం లేదు. బి బోనులోనులేడు. సి సాక్ష్యం చెప్పాడు ఎలా అంటే హత్యానేరం మరో ఎక్స్ మిద పడింది. ఆ సందర్భంలో సి సాక్ష్యం చెప్పడన్న మాట. ఎక్స్ ఈ నేరం చేయలేదని.... అదన్న మాట విషయం. కనుక నేను చెప్పింది మీరు నమ్మాలి."

 

    "ఓకె ఓకె , నీవు చెప్పింది ఓ విధంగా బాగానే వుంది. ఆ కధ నమ్మతగ్గట్ట్లుగానేవుంది. మన కధ అలా కాదు కదా ! నిజం నిరూపించే సాక్ష్యం అదే ఆధారం నీ దగ్గర వుంది. అది చూపిస్తే నమ్ముతాముకదా?" ఈ తఫా శ్రీవిద్య అంది.

 

    "చూపించకపోతే నే చెప్పింది నమ్మరా?" మహానంధ అడిగింది.

 

    ధైర్య శ్రీవిద్య బెంచిమీద అనీజీగా కదిలారు.

 

    "నమ్మరన్నమాట?" మహానంధ అడిగింది.

 

    "వేళాకొళానికి కూడా మనలో మనకి అపనమ్మకాలు మనమీద మనకే అనుమానాలు రాకూడదు. ఓకే బేబి నీ మాట నమ్ముతున్నాను." ధైర్య అంది.

 

    "మి మాటే నా బాట నమ్మకమనే దారిలో నమ్రతగా నడుస్తున్నానని ఈ సందర్భంలో సంతోషంగా శలవిస్తున్నాను." శ్రీవిద్య అంది.

 

    "గుడ్ మీరు నా మాట మీద విశ్వస ముంచినందుకు థాంక్స్. కనుక వుత్త నోటి మాటలతో కాదు సాక్ష్యం చూపిస్తాను." అంటూ మెరుస్తున్న కళ్ళని తమాషాగా అల్లల్లాడించి వ్యానిటి బ్యాగ్ లో చేయి పెట్టబోయింది.

 

    వీళ్ళ గుసగుసలు విన్న లెక్చరర్ "వాట్ ఆర్ యు టాకింగ్" గట్టిగా చివర బెంచిదాకా వినపడేలా అన్నాడు.


    
    ముగ్గురు ఒక్కసారిగా నోరుముసుకున్నారు.

 

    అందరూ తలలు తిప్పి వాళ్ళనే చూస్తుండగా మరోసారి లెక్చరర్ అడిగాడు.


    
    లెక్చరర్ చాలా కోపిష్టి అంతేకాదు, ఆడపిల్లలు ఎంతలో వుండాలో అంతలోనే వుంటే సంతోషించే వ్యక్తి. స్రీకి బానిసకి (వాడు మగాడైన సరే) స్వేచ్ఛ వుండకూడదు అని నమ్మే వ్యక్తి. నిజానిజాలు దైవానికి తెలియాలి. లేక ఆయన్ని కట్టుకున్న ఇల్లాలికి తెలియాలి. ఆయన కాలేజికి వచ్చేటప్పుడు ఇంట్లో భార్య వుండగా వీధిగుమ్మానికి బయట తాళం వేసి వస్తాడట ఓసారి క్లాసు రూములో ఓ అమ్మాయిని నోరు జారి బూతుమాట అనటం నానాగోల జరగటం అయింది. ఆ మహానుభావుడి జోలికి ఎవరు పోరు.       


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS